కేసీఆర్ ను కలిసిన ఏపీ సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!

AP CM Jagan visits Telangana former CM KCR
  • హైదరాబాద్ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్
  • కేసీఆర్ కు పరామర్శ
  • కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న వైనం
ఏపీ సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఇటీవల కాలుజారి పడి, తుంటి ఎముక శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఏపీ సీఎం జగన్... ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.
Go Back to Shorts
CM Jagan
KCR
Hyderabad
YSRCP
BRS
Andhra Pradesh
Telangana

More Telugu News