స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప దుర్మరణం

Two Years Old Kid Spot Dead In Habsiguda
  • హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఘోరం
  • కొడుకును బస్సు ఎక్కించేందుకు పాపతో పాటు వెళ్లిన తండ్రి
  • బాబు ఎక్కిన వెంటనే బస్సు కదలడంతో టైర్ కింద పడ్డ పాప
కొడుకును స్కూలు బస్సు ఎక్కించేందుకు వెళుతూ కూతురును వెంట తీసుకెళ్లడం ఆ తండ్రికి తీరని విషాదాన్ని మిగిల్చింది. స్కూలు బస్సు కింద పడి కూతురు అక్కడికక్కడే చనిపోయింది. హైదరాబాద్ లోని హబ్సిగూడలో గురువారం ఉదయంం ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హబ్సిగూడలోని రవీంద్రనగర్ కు చెందిన ఓ వ్యక్తి తన కొడుకును స్కూలు బస్సు ఎక్కించేందుకు తీసుకెళ్లాడు. రెండేళ్ల పాప పరుగులు పెడుతూ అన్న వెంటపడింది.

తండ్రి వెనక వస్తుండగా పిల్లలు ఇద్దరూ ముందు నడిచారు. స్కూలు బస్సు రావడంతో బాబు జాగ్రత్తగా ఎక్కాడు.. బాబు ఇలా ఎక్కీఎక్కగానే డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో పాప బస్సు టైర్ కింద పడి నలిగిపోయింది. తీవ్ర గాయాలతో స్పాట్ లోనే చనిపోయింది. కళ్ల ముందే కూతురు చనిపోవడంతో ఆ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదంపై దర్యాఫ్తు చేపట్టారు.
Go Back to Shorts
School Bus
Two Year kid
Spot Dead
Habsiguda
Hyderabad

More Telugu News