డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ‘ట్వెల్త్ ఫెయిల్’ ప్రభంజనం.. మూడు రోజుల్లో ఏడాది రికార్డులు బద్దలు!

12th Fail Movie Becomes Disney Plus Hoststar Most Watched Film In 2023
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రూపొందించిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ రికార్డుల వర్షం కురిపించింది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబరు 29న విడుదలైన ఈ మూవీ మూడు రోజుల్లోనే 2023 ఏడాది రికార్డులు మొత్తాన్ని తుడిచిపెట్టేసి అత్యధిక వ్యూయర్‌షిప్ సాధించిన సినిమాగా రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. 

రూ. 20 కోట్లతో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52 రోజుల్లోనే రూ.66.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. నటుడు విక్రాంత్ మాసే.. మనోజ్‌కుమార్‌శర్మగా నటించాడు. 12వ తరగతి ఫెయిలైన మనోజ్‌కుమార్ ఆ తర్వాత ఐపీఎస్ అధికారి ఎలా అయ్యాడన్నదే ఈ సినిమా కథ. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్ లేనప్పటికీ నోటి మాట ద్వారానే అద్భుత విజయాన్ని అందుకుంది. 

సినిమా కేవలం 600 స్క్రీన్లలోనే విడుదల కావడంతో చాలామంది ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయారు. దీంతో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన కాసేపటికే చూసేందుకు మిలియన్ల మంది పోటెత్తారు.  ఈ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైన మూడు రోజుల్లోనే ఏడాది రికార్డులు మొత్తాన్ని కొల్లగొట్టిందని డిస్నీప్లస్‌హాట్‌స్టార్ తెలిపింది. ట్వెల్త్ ఫెయిల్ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన స్ఫూర్తిదాయక సినిమా.
Go Back to Shorts
12th Fail
Vidhu Vinod Chopra
Disney+ Hotstar
Vikrant Massey
Manoj Kumar Sharma

More Telugu News