డిసెంబరు మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు ఇవిగో!
- డిసెంబరులో రూ.1.65 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
- నవంబరుతో పోల్చితే రెండు శాతం తక్కువ
- నవంబరులో రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు
డిసెంబరు మాసం వసూళ్ల వివరాలు పరిశీలిస్తే... కేంద్ర జీఎస్టీ రూ.30,443 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.37,935 కోట్లు, సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.84,255 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.41,534 కోట్లతో కలిపి), సెస్ రూ.12,249 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.1,079 కోట్లతో కలిపి)... అని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది.