పొరబాటున షహీన్ ను కెప్టెన్ చేశారు: షాహిద్ అఫ్రిది
- అల్లుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- పాకిస్థాన్ టీ20 కెప్టెన్ గా షహీన్ అఫ్రిది
- రిజ్వాన్ కెప్టెన్ అయితే బాగుండేదన్న షాహిద్ అఫ్రిది
అయితే, షహీన్ అఫ్రిదికి పిల్లనిచ్చిన మామ, పాక్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ కు కెప్టెన్సీ ఇస్తారని భావించానని, కానీ పొరబాటున షహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ ఇచ్చినట్టుందని చమత్కరించాడు.
మహ్మద్ రిజ్వాన్ గొప్ప యోధుడు అని, నైపుణ్యాలను ఏ స్థాయిలో, ఎంతవరకు ఉపయోగించుకోవాలో అతడికి తెలుసని అఫ్రిది కొనియాడాడు. "నేను రిజ్వాన్ ను టీ20 కెప్టెన్ గా చూడాలనుకున్నాను. కానీ షహీన్ కెప్టెన్ అయిపోయాడు" అంటూ వ్యాఖ్యానించారు.
ఓ కార్యక్రమంలో షాహిద్ అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో షహీన్ అఫ్రిది, రిజ్వాన్ కూడా వేదికపై ఉన్నారు. మామ గారి సరదా వ్యాఖ్యలకు షహీన్ నవ్వులు చిందించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.