అడవిలోని అద్భుతాన్ని వెదుకుతూ వెళ్లిన 'ఫొటోగ్రాఫర్' .. ఓటీటీలో!

అడవిలోని అద్భుతాన్ని వెదుకుతూ వెళ్లిన 'ఫొటోగ్రాఫర్' .. ఓటీటీలో!

Photographer Movie Update
  • తమిళంలో రూపొందిన 'ఫొటోగ్రాఫర్'
  • ఆగస్టులో విడుదలైన సినిమా 
  • ప్రధానమైన పాత్రను పోషించిన అష్రఫ్ అలీ 
  • ఈ నెల 25వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
  • ఇతర భాషల్లోను అందుబాటులోకి

తమిళంలో రూపొందిన ఫాంటసీ టచ్ తో కూడిన ఒక మిస్టరీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ఆ సినిమా పేరే 'ఫొటోగ్రాఫర్'. ఆగస్టు 7వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. దర్శకుడిగా .. హీరోగా అష్రఫ్ అలీ చేసిన సినిమా ఇది. ఈ సినిమాకి కథను అందించింది కూడా ఆయనే. అలాంటి ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తెచ్చారు. 

ఇది ఒక ఫొటోగ్రాఫర్ చుట్టూ తిరిగే కథ. 'వీరా' ఒక ఫొటోగ్రాఫర్ .. తన టాలెంట్ పై తనకి విపరీతమైన నమ్మకం ఉంటుంది. కానీ సరైన గుర్తింపు లభించకపోవడం అతనిని నిరాశపరుస్తూ ఉంటుంది. ఏదైనా ఒక అద్భుతం చేయాలనే పట్టుదలతో అతను ఉంటాడు. అడవిలోని ఒక సీక్రెట్ ప్లేస్ లో ప్రకృతి సహజంగా జరిగే ఒక అద్భుతాన్ని గురించిన విషయం అప్పుడే అతనికి గుర్తొస్తుంది. దానిని తన కెమెరాలో బంధిస్తే తన కోరిక నెరవేరుతుందని భావిస్తాడు. ఆ వెంటనే అడవికి బయలుదేరుతాడు. 

వీరా అడవిలోకి ప్రవేశించినప్పుడు చాలా సరదాగా .. ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ తరువాత అతను డీప్ ఫారెస్టులోకి వెళుతున్న కొద్దీ వాతావరణం మారిపోతూ ఉంటుంది. తనని ఏవో అదృశ్య శక్తులు అనుసరిస్తున్నట్టు .. తనకి తెలియకుండానే తాను ప్రమాదంలోకి వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. అది నిజమేననే విషయంలో స్పష్టత రావడానికి అతనికి ఎక్కువ సమయం పట్టదు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అక్కడి నుంచి ఎలా బయటపడతాడు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? అనేది కథ. 

Advertisement
Photographer movie
Ashraf Ali
Amazon Prime Video
Tamil mystery thriller
OTT release
Forest mystery film

More Telugu News