హీరో విజయ్ పై చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి.. వీడియో వైరల్

ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత అంత్యక్రియలు కాసేపట్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఆయన అంతిమయాత్ర ప్రారంభమయింది. మరోవైపు ఆయన భౌతికకాయాన్ని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దర్శించుకున్నారు. విజయ్ కాంత్ పార్థివదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విజయ్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఉత్సాహంతో ఆయనను చుట్టుముట్టారు. సెక్యూరిటీ ఆపినా అభిమానులు ఆగలేదు. విజయ్ ను తాకేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విజయ్ పైకి చెప్పు విసిరాడు. అయితే అది విజయ్ కు తగలకుండా కొద్దిలో మిస్ అయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


More Telugu News