vijayakanth: విజయకాంత్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
తమిళ సినీ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. నటుడిగా కళారంగానికి ఆయన సేవలు ఎనలేనివన్నారు. విజయకాంత్ రాజకీయ నాయకుడిగా చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. విజయకాంత్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయకాంత్ శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేరి, అక్కడే కన్నుమూశారు.