నేను ఎన్నికల్లో ఓడినా గౌరవానికి లోటు లేకుండా చేశారు... జగన్ ను వదులుకోను: మోపిదేవి వెంకటరమణ

26-12-2023 Tue 21:20 | Andhra
Advertisement
  • రేపల్లె వైసీపీ ఇన్చార్జిగా మోపిదేవి స్థానంలో ఈపూరు గణేశ్
  • బాపట్ల జిల్లాలో మోపిదేవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం
  • రాజకీయాల్లో ఇష్టం లేని వ్యక్తులతో కొనసాగాల్సి వస్తోందని వ్యాఖ్యలు
  • తాజాగా, ఈపూరు గణేశ్ విజయానికి కృషి చేస్తామని వెల్లడి
Advertisement
బాపట్ల జిల్లాలో ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. రాజకీయాల్లో ఇష్టం లేని వ్యక్తులతో కొనసాగాల్సి వస్తోందని, మనసు చంపుకుని పనిచేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. చెరుకుపల్లిలో ఉపాధ్యాయుల సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేపల్లె నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా మోపిదేవిని తప్పించి ఈపూరు గణేశ్ ను నియమించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

తన మాటలు చర్చనీయాంశంగా మారడం పట్ల మోపిదేవి స్పందించారు. తాను ఎన్నికల్లో ఓడినప్పటికీ జగన్ తనను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారని వెల్లడించారు. ఆ తర్వాత శాసనమండలి రద్దు అనే మాట రావడంతో తనను ఖాళీగా ఉంచకుండా వెంటనే రాజ్యసభకు పంపారని మోపిదేవి వివరించారు. 

అందుకే, జగన్ లాంటి వ్యక్తిని ఎప్పటికీ వదులుకోనని స్పష్టం చేశారు. జగన్ మాట తనకు వేదం అని స్పష్టం చేశారు. ఆయన ఏం చెబితే అది చేస్తానన్నారు. ఎన్నికల్లో ఓడిన తనకు జగన్ ఇచ్చిన గౌరవం తనకు మాత్రమే కాకుండా, కార్యకర్తలకు, తన సామాజిక వర్గానికి కూడా చెందుతుందని మోపిదేవి పేర్కొన్నారు. 

రేపల్లె నియోజకవర్గానికి ఈపూరు గణేశ్ ను ఇన్చార్జిగా నియమించారని, ఈ నిర్ణయంతో కార్యకర్తల్లోనూ, తన సామాజిక వర్గ పెద్దల్లోనూ కొంత స్తబ్దత ఏర్పడిన మాట వాస్తవమేనని చెప్పారు. తనను మత్స్యకార సామాజిక వర్గం వారు ఓ పెద్దగా భావిస్తారని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థి ఈపూరు గణేశ్ విజయానికి తామంతా సన్నద్ధమవుతున్నామని స్పష్టం చేశారు.
Advertisement
Mopidevi VenkataramanaJaganYSRCPRepalleAndhra Pradesh

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more