లెహ్, లడఖ్ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం
- తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సంభవించిన భూప్రకంపనలు
- 5 కిలోమీటర్ల భూకంప కేంద్రాన్ని గుర్తించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ
- ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టుగా లేని సమాచారం
కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్‌లో భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా వివరాలు వెల్లడించింది. కాగా దేశంలో ఏదో ఒక ప్రాంతంలో నమోదవుతున్న భూప్రకంపనలు ఆందోళనలు కలిగిస్తున్న విషయం తెలిసిందే.