నవజాత శిశువును బస్టాండ్ పబ్లిక్ వాష్‌రూమ్‌లో వదిలిపెట్టిన తల్లిదండ్రులు !
- ఏడు రోజుల శిశువుని వదిలించుకునేందుకు ప్రయత్నించిన దంపతులు
- చండీగఢ్‌లో రెండు రోజులక్రితం వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
- సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు
కాగా నిందిత దంపతులు శిశువును తీసుకొని బస్ టెర్మినస్‌లోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు. వాష్‌రూమ్‌లో శిశువుని వదిలి అక్కడి నుంచి పరిగెత్తుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయని వెల్లడించారు. నిందిత దంపతులు పంజాబ్‌లోని పఠాన్‌కోట్ దిశగా వెళ్లినట్టు అనుమానిస్తున్నామని, ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందన్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.