Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంచల్‌గూడ జైలు నుంచి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ విడుదల

Big Boss winner Pallavi Prashanth released
Advertisement
  • నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్
  • ప్రశాంత్ విడుదలవుతున్నాడని తెలిసి జైలు వద్దకు చేరుకున్న అభిమానులు, మీడియా
  • మీడియా కంటపడకుండా వెళ్లిపోయిన పల్లవి ప్రశాంత్
Advertisement
బిగ్ బాస్-సీజన్ 7 తెలుగు విజేత పల్లవి ప్రశాంత్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న అతను చంచల్‌గూడ జైలు నుంచి తన నివాసానికి బయలుదేరాడు. ప్రశాంత్‌ను చూసేందుకు జైలు వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చాడు.

పల్లవి ప్రశాంత్ విడుదలవుతున్నాడని తెలిసి మీడియాతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. కానీ ఎవరికీ కనిపించకుండానే వెళ్లిపోయాడు. పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రతి నెల 1వ తేదీన, 16వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని, అక్కడ సంతకం చేయాలని ఆదేశించింది. బెయిల్ షరతులు పాటించకపోతే బెయిల్ రద్దు చేస్తామని తెలిపింది.
Advertisement
Advertisement
pallavi prashanth
Bigg Boss
Telangana
Crime News

More Telugu News