సీఎం హోదాలో ఇదే మీకు చివరి బర్త్ డే: అయ్యన్నపాత్రుడు

This is last birthday for Jagan as CM says Ayyanna Patrudu
  • మూడు, నాలుగు నెలల్లో జగన్ మాజీ సీఎం అవుతున్నారన్న అయ్యన్న
  • పుట్టినరోజున ప్రకటనలతో సొంత పత్రికకు రూ. 100 కోట్లు కొల్లగొట్టారని విమర్శ
  • ప్రైవేట్ సంస్థలను బెదిరించి యాడ్స్ పేరుతో వసూళ్లు చేస్తారా? అని ప్రశ్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ఇదే మీకు చివరి బర్త్ డే అని ఎక్స్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. మరో మూడు, నాలుగు నెలల్లో మీరు మాజీ సీఎం కాబోతున్నారని అన్నారు. ఇప్పటికే ఈ విషయం మీకు అర్థమయినట్టుందని... అందుకే ఒక్క రోజులో తమ పుట్టినరోజు ప్రకటనల పేరుతో సొంత పత్రిక కోసం రూ. 100 కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. 

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ శాఖల నుంచి కోట్లు కుమ్మరించి శుభాకాంక్షలకు ప్రకటనలా? అని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ సంస్థలను బెదిరించి యాడ్స్ పేరుతో వసూలు చేస్తారా? పుట్టినరోజు నాడు అబద్ధాలు చెప్పడమే తమరి నైజమా? అని ప్రశ్నించారు. పుట్టినరోజు పేరుతో ఒక్క రోజులో రూ. 100 కోట్లు కొట్టేసిన ఏకైక సీఎం మీరే అని దుయ్యబట్టారు. పుట్టినరోజును సైతం ఆర్థిక ఉగ్రవాదానికి వేదికగా చేసుకుంటారు కాబట్టే... సీఎంగా ఇది మీకు చివరి పుట్టినరోజు అవుతుందని చెప్పారు. అక్రమ పద్ధతిలో, అధికారిక దోపిడీలో మీకు మీరే సాటి... రాష్ట్రం మాత్రం లూటీ అని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Ayyanna Patrudu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News