బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పిలుపు
- ఢిల్లీ నుంచి వచ్చేయాలంటూ ఆదేశం
- పార్లమెంట్ లో గందరగోళం నేపథ్యంలో మెసేజ్
- పార్టీ ఎంపీలతో విడివిడిగా భేటీ కానున్న కేసీఆర్
కాగా, పార్లమెంట్ లో సోమవారం 93 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు పడగా.. మంగళవారం మరో 50 మంది ఎంపీలపై వేటు పడింది. దీంతో సభలు సజావుగా సాగే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీలను కేసీఆర్ వెనక్కి పిలిచినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో జరిగిన గందరగోళం వివరాలను తెలుసుకోవడంతో పాటు పార్టీ తరఫున సభలలో వ్యవహరించాల్సిన విధానంపై ఎంపీలకు సూచనలు చేస్తారని సమాచారం.