రవితేజ కొత్త చిత్రం 'మిస్టర్ బచ్చన్' ప్రారంభం

Raviteja new movie Mr Bachchan launched
  • రవితేజ, హరీశ్ శంకర్ కాంబో రిపీట్
  • మిరపకాయ హిట్ తర్వాత మళ్లీ కలిసిన రవితేజ, హరీశ్ శంకర్ 
  • ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న 'మిస్టర్ బచ్చన్' 
మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం 'మిస్టర్ బచ్చన్' లాంఛనంగా ప్రారంభమైంది. హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. 'మిరపకాయ' చిత్రంతో హిట్ కొట్టిన రవితేజ-హరీశ్ శంకర్ జోడీ దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం జట్టు కట్టింది. 

ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్తమ్మాయి భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఉత్తరాదికి చెందిన ఈ అందాలభామకు ఇదే తొలి చిత్రం అని తెలుస్తోంది. 

'మిస్టర్ బచ్చన్' చిత్రం ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తమ పీపుల్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. 

కాగా, ఈ చిత్రం ప్రారంభోత్సవంపై రవితేజ స్పందిస్తూ... తన అభిమాన కథానాయకుడు అమితాబ్ బచ్చన్ పేరుతో ఉన్న పాత్రను పోషిస్తున్నానని, ఇదొక గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

'మిస్టర్ బచ్చన్' ముహూర్తం షాట్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు. రఘురామకు హీరో రవితేజ కజిన్ అవుతారు. 
Advertisement
Mr Bachchan
Raviteja
Harish Shankar
Bhagyasri Borse
TG Viswa Prasad
Tollywood

More Telugu News