మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... మెట్రో రైళ్లపై ప్రభావం... సులభంగా దొరుకుతున్న సీట్లు!
- ఆటోలపై తీవ్ర ప్రభావం చూపిన ఉచిత బస్సు ప్రయాణం
- మెట్రో రైళ్లలోనూ దాదాపు అదే పరిస్థితి
- పీక్ అవర్స్‌లోను మెట్రోలో తగ్గిన మహిళల ప్రయాణం
కార్యాలయాలు సమీపంలో ఉన్నప్పుడు ఇదివరకు మెట్రో ఎక్కిన వారు కూడా ఇప్పుడు బస్సును ఎక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఉచిత ప్రయాణ ప్రభావం మెట్రోపై కూడా పడింది. అదే సమయంలో బస్సులలో మహిళా ఉద్యోగుల జాతర కనిపిస్తోంది. కొంతమంది మహిళలు ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు.. మెట్రో స్టేషన్ నుంచి ఆఫీస్ వరకు కూడా ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు.
ప్రధాన మార్గాల్లో తిరిగే బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైనప్పటి నుంచి సీట్లు దొరకడమే గగనంగా మారింది. నాన్ పీక్ అవర్స్‌లో మెట్రో రైళ్లలో మహిళల రద్దీ బాగా తగ్గింది. మెట్రోలో గతంలో కంటే రద్దీ తగ్గిందని, సీట్లు దొరుకుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.