"ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తా" అనడం సరికాదు: కూనంనేని
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే 2 హామీలు నెరవేర్చిందని ప్రశంస
- కేంద్రం నుంచి రాష్ట్రాలనికి నిధులు రావాల్సి ఉందని వెల్లడి
- హామీలు నెరవేర్చేందుకు డబ్బులు ఇబ్బంది కాదని వ్యాఖ్య
అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నడిచేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 2020లో పదిహేడు రోజులు, 2023లో పదకొండు రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచిందన్నారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా చర్చ జరగాలన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని విపక్షాలు అనడం సరికాదన్నారు.
పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేసుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే బీఆర్ఎస్ ఓడిందన్నారు. ఉద్యమ పార్టీగా పేరున్న బీఆర్ఎస్ స్వేచ్ఛను హరించిందని కూనంనేని ఆరోపించారు.