జేబులో పేలిన ఫోన్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు
- గద్వాలలో ఘటన
- పేలుడుతో చెల్లాచెదురుగా పడిన ఫోన్ భాగాలు
- ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్న బాధితుడు
గద్వాలలోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు కూరగాయాలు కొనేందుకు మార్కెట్ వచ్చాడు. ఈ క్రమంలో జేబులో ఉన్న ఫోన్ పేలిపోయింది. ఫోన్ భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఫోన్ పేలుడుతో భయపడిన స్థానికులు దూరంగా పరుగులు తీశారు. బాధితుడి ప్యాంటు కాలిపోయింది. జయరాముడు వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకున్నాడు.