‘వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి భర్తీకి రోహిత్ శర్మకు ఇదే మంచి అవకాశం..’ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో రోహిత్ కీలకమవబోతున్నాడని విశ్లేషించిన సన్నీ
- తన తర్వాతి స్థానాల్లో వచ్చే బ్యాటర్లను సెట్ చేయడంలో ముఖ్యపాత్ర పోషించనున్నాడని వ్యాఖ్య
- టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ మొదలుకానున్న నేపథ్యంలో మాజీ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదిలావుంచితే.. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ఆదివారం జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. టీ20 సిరీస్ అనంతరం వన్డేలు, ఆ తర్వాత డిసెంబర్ 26న తొలి టెస్టు మ్యాచ్ ఆరంభమవనుంది. టెస్టు సిరీస్‌లో టీమిండియాకు గట్టి పోటీ ఎదురుకానుంది. సౌతాఫ్రికాను వారి దేశంలో భారత్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్‌లో ఓడించలేదు. ఎనిమిది టెస్ట్ సిరీస్‌లు ఆడినప్పటికీ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. టీమిండియా చివరిసారిగా 2021/22లో 2-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. 2017/18లో కూడా 2-1 తేడాతో భారత్ సిరీస్ ఓడిపోయింది. అయితే సిరీస్ డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే టీ20, వన్డే సిరీస్‌ల కంటే టెస్టు మ్యాచ్‌లపైనే ఎక్కువ ఫోకస్ ఉంది.