విశాఖలో నాదెండ్ల మనోహర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతకు నిరసనగా మనోహర్ ధర్నా
- వైసీపీ ఎంపీ ఎంవీవీ నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని మనోహర్ మండిపాటు
- రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శ
టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్మా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియలెస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా? అని ప్రశ్నించారు.