కేసీఆర్‌కు ఫోన్ చేసి పరామర్శించిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్

  • కేసీఆర్ త్వరగా కోలుకోవాలన్న అఖిలేశ్ యాదవ్
  • యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన అసదుద్దీన్
  • కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న అసదుద్దీన్
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఆకాంక్షించారు. కేసీఆర్‌కు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్‌ను మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు. అనంతరం అసదుద్దీన్ మాట్లాడుతూ... కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకొని తిరిగి సాధారణ జీవితం గడపాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

Akhilesh Yadav
KCR
Telangana

More Telugu News