వైద్యుల పర్యవేక్షణలో... అతి కష్టం మీద నడుస్తున్న కేసీఆర్.. వీడియో ఇదిగో

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు ఫ్రాక్చర్ అయింది. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్సను నిర్వహించి, స్టీల్ ప్లేట్లను అమర్చారు. మరోవైపు, వాకర్ ఆధారంగా కేసీఆర్ నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన నడవడాన్ని వైద్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.


More Telugu News