కోహ్లీతో గొడవ.. అవతల ఉన్నది ఎలాంటోడైనా తగ్గబోనన్న గంభీర్
- ఇటీవల శ్రీశాంత్‌తో మైదానంలో గంభీర్ గొడవ
- ఐపీఎల్‌లో కోహ్లీతో వాగ్వివాదం
- మెంటార్‌గా తన ఆటగాళ్లను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తానన్న గంభీర్
ఐపీఎల్‌లో ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి గొడవే జరిగింది. కోహ్లీతో నవీనుల్ హక్, గంభీర్ వాగ్వివాదానికి దిగారు. ఇది అప్పట్లో సంచలనమైంది. ఈ ఘటనపై గంభీర్ తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. మెంటార్‌గా తన జట్టు ఆటగాళ్లకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకునే హక్కు తనకు ఉండదని కానీ, మ్యాచ్ ముగిశాక తమ ఆటగాళ్లతో ఎవరైనా వాగ్వివాదానికి దిగితే వెళ్లి అడ్డుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు. అటువైపు ఉన్నది ఎవరైనా సరే తమ ప్లేయర్లను కాపాడుకోవడం తన బాధ్యత అని తేల్చి చెప్పాడు.