తెలంగాణలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

  • ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం
  • ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు
  • రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆరు గ్యారెంటీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభంకాబోతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం పట్ల మహిళల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది.

Free RTC
Women
Telangana
Revanth Reddy
Congress

More Telugu News