నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ
- శాసనసభా పక్ష నేతగా కేసీఆర్
- అనంతరం, గన్ పార్క్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించనున్న ఎమ్మెల్యేలు
- ఉదయం 11 గంటలకు అసెంబ్లీ తొలి సమావేశానికి హాజరు
కాగా, ఈ సమావేశం అనంతరం కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ తొలి సమావేశానికి హాజరవుతారు.