సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నాం... ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

Congress leaders meets Governor Tamilisai
  • గవర్నర్‍‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేశ్ కుమార్ గౌడ్
  • సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు లేఖ అందజేత
  • 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ గవర్నర్‌కు అందజేత
రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆ పార్టీ నేతల బృందం బుధవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులతో కూడిన బృందం రాజ్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లుగా లేఖను అందించారు. దీంతో పాటు 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా వారు కోరారు.
Go Back to Shorts
Congress
Tamilisai Soundararajan
Revanth Reddy
Telangana Assembly Results

More Telugu News