నిజమయ్యేలా ఉన్న ఎగ్జిట్ పోల్స్.. అంచనాలకు మించి అధిక్యంలో కాంగ్రెస్
- మునుగోడులో రెండో రౌండ్‌లో కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి 2 వేల ఓట్ల ఆధిక్యం
- హుజూర్‌నగర్‌లో తొలి రౌండ్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 2,380 ఓట్ల ఆధిక్యం
మునుగోడులో రెండో రౌండ్ ముగిసే సరికి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి 2 వేల ఓట్ల ముందంజలో ఉన్నారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉండగా, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని ముందంజలో ఉన్నారు. దేవరకద్రలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి, బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్, హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్, జగిత్యాలలో జీవన్‌రెడ్డి, హుజూర్‌నగర్‌లో తొలి రౌండ్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2,380 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి సామేలు ముందంజలో ఉన్నారు.