Seethakka: కుట్రలతో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క ఆవేదన

Seethakka fires on BRS leaders
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ నేతలు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తూ, కుట్ర రాజకీయాలతో ఇబ్బంది పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. తన కార్యకర్తలను డబ్బులతో కొని, తనపై తప్పుడు ప్రచారం చేయించారని విమర్శించారు. ఎన్ని కష్టాలు వచ్చినా తాను ములుగు ప్రజల వెంటే ఉంటానని చెప్పారు. కష్టకాలంలో కూడా తాను ప్రజల వెంటే ఉన్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని... ఆడబిడ్డ ఉసురు వారికి కచ్చితంగా తగులుతుందని చెప్పారు. ఆడబిడ్డగా తనను ములుగు ప్రజలు ఆదరించారని... చిన్న పిల్లలు కూడా తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఇంతకన్నా తన జీవితానికి ఏం కావాలని అన్నారు. తన గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తానని అన్నారు.
Go Back to Shorts
Seethakka
Congress
BRS

More Telugu News