‘ఆస్ట్రేలియా క్రికెటర్లకు అహంకారం’ అని వ్యాఖ్యానించిన నెటిజన్‌కు డేవిడ్ వార్నర్ రిప్లై ఇదే
- ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎవరినైనా కలిశావా అని ప్రశ్నించిన డేవిడ్ వార్నర్
- కంప్యూటర్ కీ బోర్డ్ నుంచి జాలువారిందా అని అడిగిన ఆసీస్ స్టార్
- భారత్‌పై ఫైనల్ గెలిచాక ఆస్ట్రేలియా ఆటగాళ్లను విమర్శించిన భారత ఫ్యాన్స్
‘‘గతంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా అహంకారంతో ఉండేవాళ్లు. ఈ వరల్డ్ కప్ గెలిచాక అది మరింత ఎక్కువైంది’’ అని డేవిడ్ వార్నర్‌ని ట్యాగ్ చేస్తూ ఓ యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి డేవిడ్ వార్నర్ రిప్లై ఇచ్చాడు. ‘‘ ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎవరినైనా కలిశావా లేక కంప్యూటర్ కీబోర్డ్ నుంచి జాలువారిందా?’’ అని సరదాగా ప్రశ్నించారు. స్మైలీ ఎమోజీలను జోడించాడు. వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.