01 Thu 21:19 న్యూజిలాండ్‌పై టెస్టులో రికార్డు సాధించిన బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచిన హొస్సేన్ ఈ ఘనత సాధించిన 32వ అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు తొలి 24 టెస్టుల్లో 5 సెంచరీలు పూర్తి చేసిన శాంటో
02 Thu 19:11 రికార్డు ధర పలికిన హైదరాబాద్ భూములపై న్యాయ వివాదం.. ఎస్బీఐ పిటిషన్‌తో వేలానికి బ్రేక్ రాయదుర్గం భూముల వేలం ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే భూమి తమదేనంటూ కోర్టును ఆశ్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 28న ఎకరానికి రూ. 237 కోట్ల రికార్డు ధర పలికిన భూమి టీజీఐఐసీ, గౌరా వెంచర్స్‌కు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు మూడు వారాల పాటు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశం
03 Thu 19:03 షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం: మల్లు రవి ఎంతటి వారైనా సరే వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దవద్దన్న మల్లు రవి క్రమశిక్షణ కమిటీ ముందు షబ్బీర్ ఆదివారం హాజరవుతారని వెల్లడి నేతలు క్షమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
04 Thu 18:56 హైదరాబాదీ వైద్యుడికి బ్రిటన్‌లో అత్యున్నత గౌరవం ప్రొఫెసర్ వసీం హనీఫ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం వైద్య రంగంలో సేవలకుగాను ప్రతిష్ఠాత్మక ఓబీఈ పురస్కారం కింగ్స్ బర్త్‌డే ఆనర్స్ 2026 జాబితాలో చోటు డయాబెటిస్, ఆరోగ్య అసమానతలపై చేసిన కృషికి గుర్తింపు
05 Thu 18:52 రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ఉత్తమ్ జూన్ 30న రేవంత్ చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న ఉత్తమ్ 7 రకాల సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్టు వెల్లడి నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న మంత్రి
06 Thu 18:49 నేను జైల్లో ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు: కవిత గులాబీ బాస్‌లపై సంచలన ఆరోపణలు చేసిన కవిత తాను జైల్లో ఉన్నప్పుడు కొందరు నేతలు తన వద్దకు వచ్చారన్న కవిత బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో వచ్చారని వెల్లడి ఆ ప్రతిపాదనను తాను తీవ్రంగా వ్యతిరేకించానన్న కవిత పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డానని వెల్లడి
07 Thu 18:39 రోడ్డు ప్రమాదాల పెరుగుదలలో తెలంగాణ టాప్.. కేంద్రం నివేదికలో షాకింగ్ నిజాలు! ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాల పెరుగుదల 2024లో 13.5 శాతం పెరిగిన యాక్సిడెంట్లు.. కేంద్ర నివేదిక వెల్లడి ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని గుర్తింపు మరణాల వృద్ధిరేటులోనూ దక్షిణ భారతంలో తెలంగాణ టాప్ చిన్న ప్రమాదాల నమోదుతోనే సంఖ్య పెరిగిందంటున్న అధికారులు
08 Thu 18:32 ఓవర్సీస్‌లో సమంత సత్తా.. రికార్డు స్థాయిలో 'మా ఇంటి బంగారం' ప్రీ సేల్స్ సమంత కొత్త చిత్రం 'మా ఇంటి బంగారం'కు భారీ క్రేజ్ నార్త్ అమెరికాలో 3 లక్షల డాలర్లను దాటిన ప్రీ సేల్స్ సమంత కెరీర్‌లో ఇదే అత్యధిక ప్రీ సేల్స్ రికార్డ్ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ప్రీమియర్స్ రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా, నందినీ రెడ్డి దర్శకత్వంలో సినిమా
09 Thu 18:25 రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు.. ఐపీఎస్ సునీల్ నాయక్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు పార్లమెంటుపై దాడి చేసే వారికి, ఎంపీపై దాడి చేసే వారికి తేడా ఏమిటన్న హైకోర్టు రఘురామను టార్చర్ చేయబోతున్నారనే విషయం సునీల్ నాయక్ కు తెలుసని వ్యాఖ్య సునీల్ నాయక్ ఎప్పటిలోగా లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాదికి ప్రశ్న
10 Thu 18:20 తిరుపతికి మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ.. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ తిరుపతిలో జేఎస్ఎస్ మహావిద్యాపీఠం ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం 74 కోర్సులతో 10 వేల మందికి పైగా విద్యార్థులకు ఉన్నత విద్య ప్రాజెక్టు ద్వారా 20 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ప్రతిష్ఠాత్మక నాక్ ఏ++ గుర్తింపు పొందిన జేఎస్ఎస్ విద్యాసంస్థ