న్యూజిలాండ్‌పై టెస్టులో రికార్డు సాధించిన బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో
- కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచిన హొస్సేన్
- ఈ ఘనత సాధించిన 32వ అంతర్జాతీయ క్రికెటర్‌గా గుర్తింపు
- తొలి 24 టెస్టుల్లో 5 సెంచరీలు పూర్తి చేసిన శాంటో
సిల్హెట్లో న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పట్టు బిగించడంతో, కెప్టెన్‌గా అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన తొలి బంగ్లాదేశ్ క్రికెట్‌గా నజ్ముల్ హొస్సేన్ శాంటో నిలిచాడు. అతను 26 మ్యాచ్‌లలో మోమినుల్ హక్ ప్రయత్నాన్ని ఓడించి 24 మ్యాచ్‌లలో ఐదు టెస్ట్ సెంచరీలు చేసిన బంగ్లాదేశీగా కూడా నిలిచాడు. కాగా సిల్హెట్ టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 212 పరుగులుగా ఉంది. క్రీజులో శాంటో(104), ముస్తిఫిజర్ రహీం(43) పరుగులతో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన 86 పరుగుల ఆధిక్యంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.