ఆసీస్ తో నాలుగో టీ20 కోసం రాయ్ పూర్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు
- టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్ ల సిరీస్
- రేపు రాయ్ పూర్ లో నాలుగో టీ20
- సిరీస్ లో 2-1తో టీమిండియా ఆధిక్యం
టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రేపు (డిసెంబరు 1) రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు జరగ్గా... తొలి రెండు మ్యాచ్ ల్లో టీమిండియా నెగ్గగా, మూడో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది.