ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: అచ్చెన్నాయుడు
- ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ను కలిసిన టీడీపీ బృందం
- అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు
- 8 జిల్లాల కలెక్టర్లపై ఆధారాలతో ఫిర్యాదు చేశామని వెల్లడి
అనంతరం, అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎనిమిది జిల్లాల కలెక్టర్ల తీరు చూస్తుంటే, వారు జిల్లా కలెక్టర్లా లేక వైసీపీ కార్యకర్తలా అనే సందేహం వస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. వారిపై ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. మీరు చేస్తున్న తప్పిదాలు రికార్డు అవుతున్నాయి... ఆ ఎనిమిది జిల్లాల కలెక్టర్లు జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు.
అంతేకాకుండా, 17 నియోజకవర్గాలకు సంబంధించి ఆధారాలతో సహా వైసీపీ ఓట్ల అక్రమాలను ఎన్నికల సంఘానికి వివరించామని తెలిపారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం వైసీపీలో కనపడుతోందని విమర్శించారు.