మంత్రి కేటీఆర్ దీక్షా దివస్... ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కాంగ్రెస్ ఫిర్యాదు
- తెలంగాణ భవన్ లోపల నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని ఈసీ సూచన
కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్క్వాడ్ తెలంగాణ భవన్కు వెళ్లి.. దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని బీఆర్ఎస్ నేతలను కోరింది. అయితే ఇది కొత్త కార్యక్రమం కాదని, ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అయితే కార్యక్రమాన్ని తెలంగాణ భవన్ లోపల... నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో భవనం లోపల కార్యక్రమాన్ని నిర్వహించారు. దీక్షా దివస్ సందర్భంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు.