ఆస్ట్రేలియాలో భారతీయ యువకుడిపై దాడి.. మెడికల్లీ ఇన్‌డ్యూస్డ్ కోమాలో బాధితుడు
- యూనివర్సిటీ ఆఫ్ టాస్మేనియాలో మాస్టర్స్ చేస్తున్న బాధిత యువకుడు
- నవంబర్ 5 తెల్లవారుజామున దాడి
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలైన యువకుడికి బ్రెయిన్ సర్జరీ
- నిందితుడికి మెజిస్ట్రేట్ బెయిల్
దాడి జరిగిన రోజునే నిందితుడు బెంజమిన్ డాడ్జ్ కాలిన్స్‌ను (25) కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిపై క్రిమినల్ కోడ్ అసాల్ట్ నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడికి గరిష్ఠంగా 21 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, ఇది జాత్యాహంకారంతో చేసిన దాడిగా భావించేందుకు అధారాలేవీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు, కోలిన్స్‌కు మెజిస్ట్రేట్ బెయిల్ జారీ అయ్యింది. డిసెంబర్ 4న మరోసారి కోర్టు ముందుకు హాజరుకానున్నాడు.