నాటి భారత పర్యటనలో దిండు కవర్‌పై మైకేల్ జాక్సన్ ఏం రాశాడు? వేలంలో రూ.8 లక్షలు!
- ముంబైలో మైకేల్ కచేరీకి హాజరైన దాదాపు 60 వేల మంది అభిమానులు
- సోనాలి బింద్రే సంప్రదాయ మరాఠీ చీరకట్టులో స్వాగతం
- దిండు కవర్‌పై భారత్‌పై ప్రేమను చాటుతూ చేతిరాత సందేశం
- మళ్లీ వస్తానంటూ భారతీయులకు జాక్సన్ భావోద్వేగ సందేశం
- దాతృత్వ వేలంలో 10 వేల డాలర్లకు అమ్ముడైన దిండు కవర్
- పిల్లలను ప్రేమించి, విద్య అందించాలని సందేశంలో ప్రస్తావన
పాప్ సంగీత ప్రపంచంలో రారాజుగా వెలిగిన మైకేల్ జాక్సన్‌కు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1996లో ముంబయిలో ఆయన ఇచ్చిన ఒక్కగానొక్క సంగీత ప్రదర్శన ఇప్పటికీ అభిమానులకు మధుర జ్ఞాపకమే. అయితే ఆ పర్యటనలో ఆయన వదిలివెళ్లిన ఓ చేతిరాత సందేశం కూడా అంతే ప్రత్యేకంగా నిలిచింది. భారత్‌ను విడిచి వెళుతూ హోటల్ గదిలోని దిండు కవర్‌పై రాసిన ఆ సందేశంలో.. ‘మళ్లీ వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తానని మాటిస్తున్నా’ అంటూ భారతీయులపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ దిండు కవర్‌ను తర్వాత వేలంలో 10 వేల డాలర్లకు విక్రయించారు.
ఘన స్వాగతం.. అద్భుతమైన ప్రదర్శన
మైకేల్ జాక్సన్ 1996 అక్టోబర్ 30న భారత్‌కు వచ్చాడు. నటి సోనాలి బింద్రే సంప్రదాయ మరాఠీ చీరకట్టులో ఆయనకు తిలకం దిద్ది, హారతి ఇచ్చి స్వాగతం పలికింది. నవంబర్ 1న ముంబయిలోని అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో తన ‘హిస్టరీ వరల్డ్ టూర్’లో భాగంగా సంగీత ప్రదర్శన ఇచ్చాడు. దాదాపు 60 వేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బంగారు, నలుపు రంగుల దుస్తుల్లో రాకెట్ ఆకారంలోని వేదిక నుంచి ఆయన ప్రవేశించడంతో అభిమానుల ఉత్సాహం తారస్థాయికి చేరింది. ఆయన పాటలు, ఐకానిక్ మూన్‌వాక్ స్టెప్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. వ్యాపార, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఆయనను కలిసేందుకు ఆసక్తి చూపారు.
దిండుపై ప్రేమ సందేశం
భారత్ నుంచి బయల్దేరే ముందు మైకేల్ జాక్సన్ తన హోటల్ గదిలోని దిండు కవర్‌పై భావోద్వేగ సందేశాన్ని రాశాడు. ‘భారత్.. జీవితమంతా నిన్ను చూడాలని కోరుకున్నా. నీ ప్రజలను ప్రేమించా. ఇప్పుడు నిన్ను విడిచి వెళ్లాల్సి వస్తున్నందుకు నా హృదయం బాధతో నిండిపోయింది. మళ్లీ వచ్చి నిన్ను ప్రేమిస్తానని మాటిస్తున్నా’ అంటూ రాసినట్లు పలు కథనాలు వెల్లడించాయి.
భారతీయుల ఆధ్యాత్మిక చైతన్యం తనను తాకిందని, పిల్లలు తన హృదయాన్ని కదిలించారని జాక్సన్ పేర్కొన్నాడు. పిల్లలను ప్రేమించాలని, వారికి విద్య అందించాలని సందేశమిచ్చాడు. భారత్ తనకు ప్రత్యేకమని, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తానని రాశాడు.
ఈ దిండు కవర్‌ను సినీ ఫైనాన్షియర్ భరత్ షా దాతృత్వ వేలంలో 10 వేల డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తువ్వాలు, అద్దం, ట్రే క్లాత్‌పై కూడా జాక్సన్ ఇలాంటి సందేశాలు రాసినట్లు కథనాలు పేర్కొన్నాయి. వాటిని కూడా తర్వాత వేలం వేశారు.