Surya: హీరో సూర్యకు ప్రమాదం.. వైద్యులు ఏం చెప్పారంటే..!

Doctors report on actor Surya injury
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం 'కంగువా' సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సూర్యపై కెమెరా పడింది. ఈ ప్రమాదంలో సూర్య భుజానికి గాయమయింది. సూర్య గాయపడిన విషయాన్ని సూర్య పీఆర్ కూడా ధ్రువీకరించారు. షూటింగ్ లో సూర్య గాయపడిన విషయం నిజమేనని, అయితే అది అంత పెద్ద గాయం కాదనే సమాచారం నిర్మాతల నుంచి వచ్చిందని ఆయన తెలిపారు. సూర్యను పరీక్షించిన వైద్యులు ఆయన పరిస్థితి బాగానే ఉందని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారని వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా తో కలిసి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.
Go Back to Shorts
Surya
Kollywood
Tollywood
Injury

More Telugu News