Kannappa: మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి ఫస్ట్ పోస్టర్.. పెరిగిన హైప్

Kannappa movie team released first poster
షార్ట్స్‌లో చూడండి
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చేసింది. నేడు విష్ణు పుట్టిన రోజును పురస్కరించుకుని తొలి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో శివలింగంలా కిందికి దూకుతున్న జలపాతం కనిపిస్తుండగా కన్నప్ప బాణాలు సంధిస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కన్నప్ప టైటిల్‌ను ఆకర్షణీయంగా డిజైన్ చేశారు.

పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం దాదాపు 80 మంది అంతర్జాతీయ ఫైటర్లు పనిచేస్తున్నట్టు సమాచారం. న్యూజిలాండ్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘కన్నప్ప’ను రూ. 150 కోట్లకుపైగా బడ్జెట్‌తో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. హిందీలో మహాభారతం సిరీస్‌లను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్‌సింగ్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మధుబాల, ప్రభాస్, నాయనతార, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ వంటి స్టార్లు నటిస్తున్నారు.
Go Back to Shorts
Kannappa
Manchu Manoj
Kannappa Movie
Kannappa Movie First Movie
Manchu Manoj Birth Day

More Telugu News