రోహిత్ ఔట్‌పై స్పందించిన సునీల్ గవాస్కర్
- మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఆ షాట్ ఆడకుండా ఉండాల్సిందని వ్యాఖ్య
- అప్పటికే ఆ ఓవర్‌లో 10 పరుగులు రావడంతో ఆ షాట్ అవసరంలేదన్న సన్నీ
- స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ దిగ్గజం
రోహిత్ శర్మ ఔట్ కావడమే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ కావచ్చని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఆ సమయంలో రోహిత్ చాలా అద్భుతంగా ఆడాడని, వేగంగా పరుగులు రాబట్టాడని అన్నాడు. ఔట్ అయిన ఓవర్‌లో ఒక సిక్స్, ఫోర్‌తో అప్పటికే 10 పరుగులు వచ్చిన తర్వాత ఆ షాట్ ఆడకుండా ఉండాల్సిందని గవాస్కర్ విశ్లేషించాడు. ఆ బంతి సిక్సర్ అయ్యుంటే అందరం లేచి చప్పట్లు కొట్టి అభినందించే వాళ్లమని, కానీ అంత కంగారుగా ఆ షాట్ ఆడాల్సిన అవసరమైతే లేదని అన్నాడు. మాక్స్‌వెల్స్, హెడ్స్, మార్ష్ బౌలింగ్ కోసం ఎదురుచూసి దాడి చేయాల్సిందని, కానీ అది జరగలేదని స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గవాస్కర్ అన్నాడు.
కాగా వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. 120కిపైగా స్ట్రైక్ రేట్‌తో మొత్తం 503 పరుగులు కొట్టాడు. సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 29 బంతుల్లోనే 47 పరుగులు కొట్టి ఔటయ్యాడు.