Virat Kohli: చూపులతోనే యుద్ధం చేసిన కోహ్లీ, లబుషేన్... వీడియో ఇదిగో!

టీమిండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టులో మార్నస్ లబుషేన్ కూడా అలాంటివాడే. సై అంటే సై అంటాడు. తాజాగా, వరల్డ్ కప్ ఫైనల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఆస్ట్రేలియా లక్ష్యఛేదనలో 9వ ఓవర్ అనంతరం కోహ్లీ, లబుషేన్ చూపులతోనే యుద్ధం చేసినంత పనిచేశారు. అప్పటికి లబుషేన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు. ఫీల్డింగ్ మారే సమయంలో కోహ్లీ... లబుషేన్ వైపు కోర చూపులు చూస్తూ వెళుతుండగా, లబుషేన్ కూడా ఎక్కడా తగ్గకుండా కోహ్లీ వైపు తీక్షణంగా చూస్తూ క్రీజు వైపు అడుగులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Virat Kohli
Marnus Labuschagne
Final
Team India
Australia

More Telugu News