హనుమంతుడి గుడి లేని ఊరు లేదు... కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు: ఎమ్మెల్సీ కవిత
- తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్‌ది పేగు బంధమన్న కవిత
- కాంగ్రెస్‌ది అధికారం కోసం అహంకారమన్న బీఆర్ఎస్ నాయకురాలు
- కేసీఆర్ మళ్లీ గెలవగానే పెన్షన్లు రూ.5వేలకు పెంచుతామన్న కవిత
- కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేస్తామని వెల్లడి
తెలంగాణ కోసం బీఆర్ఎస్ తీవ్రంగా ఉద్యమించిందని, రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ అని, అందుకే ప్రజలతో బీఆర్ఎస్‌కు పేగుబంధం ఉందన్నారు. గత పదేళ్ల కాలంలో కేసీఆర్ పాలనలో తెలంగాణ పచ్చబడిందన్నారు. కేసీఆర్ చెప్పింది చేసే వ్యక్తి అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని పనులు కూడా చేశారన్నారు. రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదని, అలాగే కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదన్నారు. రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం వస్తే పెన్షన్ రూ.5 వేలకు పెరుగుతుందన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే రూ.3 వేలకు పెరుగుతుందన్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం పెరుగుతూ అయిదేళ్లలో రూ.5 వేలకు చేరుతుందన్నారు.
కటాఫ్ డేట్‌తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని కేసీఆర్ సంకల్పించారన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద పేద మహిళలకు రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈసారి గెలవగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. అప్పుడు కోటి కార్డులు అవుతాయన్నారు. కేసీఆర్ మేనిఫెస్టో అంటే... డబ్బులు ఇచ్చే వాటిని పెంచుడు... సిలిండర్ ధర తగ్గించుడు అన్నారు. ఔర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్ అని నినదించారు.