ఎస్ఐ నోటిఫికేషన్ ప్రక్రియపై స్టే విధించిన ఏపీ హైకోర్టు
- నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన ఎస్ఐ అభ్యర్థులు
- ఎత్తు అంశంలో ఇప్పుడు అనర్హులు అంటున్నారంటూ పిటిషన్
- ఎస్ఐ అభ్యర్థుల తరఫున వాదించిన జడ శ్రావణ్
- పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు
ఎత్తు అంశంలో తమకు అన్యాయం జరిగిందని ఓ పిటిషనర్ కోర్టుకు విన్నవించాడు. ఎత్తు అంశంలో గతంలో అర్హులైన వారిని ఇప్పుడు అనర్హులుగా ప్రకటించారని వివరించాడు. ఎస్ఐ నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని కోర్టును కోరాడు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం... గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని నియామక బోర్డును ప్రశ్నించింది. అనంతరం పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ ఎస్ఐ నోటిఫికేషన్ పై స్టే విధించింది.