ఫైనల్లో టీమిండియా.. అస్సలు జీర్ణించుకోలేకపోతున్న పాక్ నటి
- పాక్ కంటే అన్నింట్లో భారత్ ముందుండడమేంటని సెహర్ షిన్వారీ ట్వీట్
- బీసీసీఐ, బీజేపీ.. త్వరలోనే సర్వనాశనమవుతాయ్ అంటూ శాపనార్థాలు
- భారత్ ను ఓడిస్తే బంగ్లాదేశ్ కుర్రాడితో డేట్ చేస్తానంటూ ఇటీవల ప్రకటన
ముందే ఫిక్స్ చేసిన మ్యాచ్ లో బాగా ఆడుతున్నట్లు టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా నటించారని, వాళ్లు మంచి నటులని విమర్శిస్తూ సెహర్ షెన్వారీ బుధవారం ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు వైరల్ కావడంతో భారత జట్టు అభిమానులు షెన్వారీపై మండిపడుతున్నారు. కామెంట్లతో రెచ్చిపోతున్నారు. కాగా, లీగ్ మ్యాచ్ లలో పాక్ జట్టు టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాతి మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడగా.. బంగ్లా ఆటగాళ్లకు షెన్వారీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్ ను చిత్తుగా ఓడిస్తే బంగ్లా కుర్రాడితో డేట్ చేస్తానని ట్వీట్ చేసింది.