కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను యూకే ప్రధాని రుషి సునాక్‌కి అందజేసిన విదేశాంగ మంత్రి జైశంకర్
- జైశంకర్ దంపతులను అధికారిక నివాసంలోకి సాదరంగా ఆహ్వానించిన రుషి సునాక్
- ప్రధాని మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జైశంకర్
- వినాయకుడి విగ్రహం, విరాట్ సంతకం చేసిన బ్యాట్‌ను బహుమతులుగా అందించిన విదేశాంగమంత్రి
మరోవైపు యూకే ప్రధానమంత్రి కార్యాలయం కూడా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. రుషి సునాక్, జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. కాగా మంత్రి జైశంకర్ వెంట ఆయన భార్య క్యోకో కూడా ఉన్నారు. వీరి యూకే పర్యటన నవంబర్ 15తో ముగియనుంది. యూకే విదేశాంగ సెక్రటరీ జేమ్స్ క్లెవర్లీతోపాటు పలువురు అధికారులు జైశంకర్‌తో సమావేశం కానున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.