Anushka Sharma: కోహ్లీ వికెట్ తీయగానే అనుష్క రియాక్షన్ చెప్పడానికి ఈ ఫొటో చాలు!

టీమిండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఓ వికెట్ తీశాడు. చేంజ్ బౌలర్ గా రంగంలోకి దిగిన కోహ్లీ ఏకంగా నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీసి ఔరా అనిపించాడు. కోహ్లీ బౌలింగ్ ప్రదర్శన పట్ల టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు.  గ్యాలరీలోంచి మ్యాచ్ వీక్షిస్తున్న కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ కూడా జోష్ ప్రదర్శించింది. కోహ్లీ వికెట్ పడగొట్టగానే, అనుష్క పట్టరాని సంతోషంతో కేరింతలు కొట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మొత్తమ్మీద 3 ఓవర్లు బౌలింగ్  చేసిన కోహ్లీ 13 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు.
Anushka Sharma
Virat Kohli
Wicket
Team India
Nederlands
World Cup

More Telugu News