Vijayasai Reddy: పురందేశ్వరి గారు ఏం చదువుకున్నారో గానీ...!: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy once again slams Purandeswari
షార్ట్స్‌లో చూడండి
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి ఎక్స్ లో స్పందించారు. పురందేశ్వరి గారు ఏం చదువుకున్నారో ఏమో గానీ, ప్రజల తెలివితేటలపై ఆమెకు చాలా చులకన భావం ఉందని విజయసాయి పేర్కొన్నారు. అందుకే రాష్ట్రంలో మద్యం మృతులు 50 లక్షల మంది అంటూ దిగ్భ్రాంతి కలిగించే అబద్ధాన్ని అవలీలగా వదిలారని వెల్లడించారు. కంటి శుక్లం ఆపరేషన్ చేయించుకుని కుడి కంటికి కట్టు కట్టుకున్న బావగారి ఎడమ కంటిలో ఆనందం చూడడం కోసమే ఆమె ఇలాంటి అసత్యాలు వల్లిస్తున్నారని విజయసాయి తెలిపారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Daggubati Purandeswari
YSRCP
BJP
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News