మేడిగడ్డ మరమ్మతులకు ప్రభుత్వం రెడీ.. సముద్రం పాలవుతున్న సాగునీరు
- అక్టోబరు 21న కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్
- ఇంజినీర్ల వైఫల్యం.. డిజైన్ లోపం వల్లేనన్న సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
- వృథాగా పోతున్న 23 టీఎంసీల నీళ్లు
మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీలన్నీ ప్రమాదంలో ఉన్నాయని, నీళ్లు నిల్వచేయొద్దని కోరింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డ (లక్ష్మీ), అన్నారం (సరస్వతి) బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. తాజాగా సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే 23 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. డ్యాం పూర్తిగా ఖాళీ అయ్యాక మరమ్మతులు చేయనున్నారు.