union minister: మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత తప్పకుండా జైలుకు వెళ్తారన్న కేంద్రమంత్రి అశ్వని చౌబే

MLC Kavitha will go jail says union minister
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్రమంత్రి అశ్వని చౌబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ హంటర్ రోడ్డులో మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మద్యం కుంభకోణం కేసులో కవితను తప్పకుండా జైలుకు పంపిస్తామన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత... ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇచ్చారన్నారు. ఈ తొమ్మిన్నరేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలను దోచుకుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు.
Go Back to Shorts
union minister
K Kavitha
BJP
Telangana Assembly Election

More Telugu News