తెలంగాణ ఎన్నికలు.. కాంగ్రెస్ కు ముస్లిం లీగ్ పార్టీ మద్దతు

IUML support to Congress in Telangana
  • కాంగ్రెస్ కు మద్దతిస్తున్నట్టు ప్రకటించిన ఐయూఎంఎల్
  • రాహుల్ కు లేఖ రాసిన ముస్లిం లీగ్ పార్టీ
  • ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని వెల్లడి
అసెంబ్లీ ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా దూసుకుపోతున్నాయి. బీఆర్ఎస్ కు ఏమాత్రం తగ్గకుండా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్ కు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు పలికాయి. తాజగా మరో పార్టీ కాంగ్రెస్ కు మద్దతు పలికింది. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతునిస్తున్నట్టు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ లేఖ రాశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఐయూఎంఎల్ తన లేఖలో పేర్కొంది. తెలంగాణలో తమ పార్టీ వేళ్లు బలంగా ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించి తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం ఇండియా కూటమి భాగస్వామిగా తమ పార్టీ పని చేస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ గెలుపు కోసం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపింది. 
Go Back to Shorts
Congress
Telangana
IUML

More Telugu News