కోహ్లీ రికార్డుపై అనుష్క శర్మ స్పందన

Anushka Sharma responds on Kohli world record
  • నేడు కోహ్లీ పుట్టినరోజు
  • దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన కోహ్లీ
  • సచిన్ 49 సెంచరీల రికార్డు సమం
  • నీకు నువ్వే గిఫ్టు ఇచ్చుకున్నావు అంటూ అనుష్క పోస్ట్
టీమిండియా డైనమిక్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఇవాళ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అంతేకాదు, కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో సెంచరీ సాధించి, 49 సెంచరీలతో సచిన్ రికార్డును సమం చేశాడు. తద్వారా తన పుట్టినరోజును చిరస్మరణీయం చేసుకున్నాడు. కోహ్లీ ఘనతపై అర్ధాంగి అనుష్క శర్మ స్పందించారు. "నీ బర్త్ డేకి నీకు నువ్వే స్పెషల్ గిఫ్టు ఇచ్చుకున్నావు" అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అనుష్క శర్మ కామెంట్ పట్ల నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. కాగా, బర్త్ డే నాడు సెంచరీ కొట్టిన తొలి భారత క్రికెటర్ కోహ్లీనే. ఇన్ని ఘనతల నడుమ, ఇవాళ కోహ్లీ అభిమానుల సంబరాలు మామూలుగా లేవు.
Go Back to Shorts
Virat Kohli
World Record
Anushka Sharma
Most ODI Tons
Sachin Tendulkar
World Cup

More Telugu News